చిన్నబోయిన చిన్నది

చెందురూడా ! చెందురూడా !
చీకటింటి వలపు రేడా !
చిన్నబోయిన చిన్నదాన్ని,
ఎక్కిరించి నవ్వబోకు.

దానికళ్ళా  కటుకను నీ చీకటింటి రంగు చేసి,
చిన్నదాని కళ్ళు పాలిపోయే.

చెందురూడా ! చెందురూడా !
కలువకన్నుల కలిమి  రేడా !
తెల్ల బోయిన చిన్నదాన్ని
ఎక్కిరించి నవ్వబోకు.

చిగురునగవుల  ఎరుపుమేరుపు
కలువకిచ్చి పిల్ల పెదవులు ముడుచు కున్నాయి

చెందురూడా ! చెందురూడా !
మామలందరి చెలిమి కాడా !
పిల్లమనసు మామకిచ్చి , మాట రానీ మూగదైనాది.

యెన్నెలమ్మను యేలినోడా !
ఎగిరిపోయీ పిల్ల మామను ,
బంతి పూలా పల్లకీలో తోలుకుని రారా .............

                                           -శ్రీ
Chinnabōyina cinnadi

Chendurūḍā! Chendurūḍā! Chīkaṭiṇṭi valapu rēḍā!
Chinnabōyina chinnadānni, Ekkirin̄ci navvabōku.
Dānikaḷḷā kaṭukanu nī cīkaṭiṇṭi raṅgu cēsi,
Chinnadāni kaḷḷu pālipōyē.

Chendurūḍā! Chendurūḍā! Kaluvakannula kalimi rēḍā!
Tella bōyina cinnadānni Ekkirin̄ci navvabōku.
Chigurunagavula erupumērupu Kaluvakicci pilla pedavulu muḍucu kunnāyi

Chendurūḍā! Chendurūḍā! Māmalandari chelimi kāḍā!
Pillamanasu māmakicci, māṭa rānī mūgadainādi.
Yennelam'manu yēlinōḍā! Egiripōyī pilla māmanu,
Banti pūlā pallakīlō tōlukuni rārā.............

-Śrī