ఏమి సృష్టి ఇది ఈశ్వరా

ఏమి  సృష్టి ఇది ఈశ్వరా ?
న్యాయమా ఇది పరమేశ్వరా ?

                 కులుకులెరుగని కోయిలమ్మకు
                        కమ్మనైనా పాటనిచ్చావు
                  గరుకు పలుకుల నెమలికేమో
                       అందెలెరుగని ఆటనిచ్చావు
               ఆట నేర్పీ , పాట నేర్పీ  .... మనిషికేమో
                బండరాతి గుండె నిచ్చావు.

ఏమి సృష్టి ఇది ఈశ్వరా ?
న్యాయమా ఇది పరమేశ్వరా ?

              త్యాగమూర్తి తరువు తల్లిని తాళ్ళు లేకనె కట్టివేసావు
              ముద్దులొలికే పూల బాలకు మూడు నాళ్లలో మృత్యువన్నావు
              ఆయువిచ్చీ , ఆశ గెలిచే శక్తినిచ్చీ  .... మనవుణ్ణీ  దానవుడి గా మార్చి వేసావు.

ఏమి సృష్టి ఇది ఈశ్వరా ?
న్యాయమా ఇది పరమేశ్వరా ?

               నిదుర మబ్బుల మొయిలు మామకు,
               తళుకు బెళుకుల మెరుపు పిల్లతో మనువు చేశావు
               బండవాడా కొండ కొనలకు ,
              పరుగు తీసే ఏటి కొంగుకు ముడులు వేసావు
మనిషి మనిషి కీ మధ్య మాత్రం మతం పేరిట మంట రేపావు.


ఏమి సృష్టి ఇది ఈశ్వరా ?
న్యాయమా ఇది పరమేశ్వరా ?

                                    - శ్రీ (1994)

Ēmi sr̥ṣṭi idi īśvarā

Ēmi sr̥ṣṭi idi īśvarā?
N'yāyamā idi paramēśvarā?

Kulukulerugani kōyilam'maku Kam'manainā pāṭaniccāvu
Garuku palukula nemalikēmō Andelerugani āṭaniccāvu
Āṭa nērpī, pāṭa nērpī.... Maniṣikēmō Baṇḍarāti guṇḍe niccāvu.

Ēmi sr̥ṣṭi idi īśvarā?
N'yāyamā idi paramēśvarā?

Tyāgamūrti taruvu tallini tāḷḷu lēkane kaṭṭivēsāvu
Muddulolikē pūla bālaku mūḍu nāḷlalō mr̥tyuvannāvu
Āyuviccī, āśa gelicē śaktiniccī....
Manavuṇṇī dānavuḍi gā mārci vēsāvu.

Ēmi sr̥ṣṭi idi īśvarā?
N'yāyamā idi paramēśvarā?

Nidura mabbula moyilu māmaku,
Taḷuku beḷukula merupu pillatō manuvu cēśāvu
Baṇḍavāḍā koṇḍa konalaku,
Parugu tīsē ēṭi koṅguku muḍulu vēsāvu
Maniṣi maniṣi kī madhya mātraṁ mataṁ pēriṭa maṇṭa rēpāvu.

Ēmi sr̥ṣṭi idi īśvarā?
N'yāyamā idi paramēśvarā? - Śrī