కలువ మాట

చుక్కల నడుమ నిన్ను చూసి
నేను చుక్కను కాలేకపోతినని మూతిముడిచాను.

నీ కోసమే నిరంతరం కళ్ళు తెరచి
ఎదురు చూసే కలువ నేనని తెలుసుకున్నాను.

నింగి చీర తళుకు బెళుకుల తారకను కాను
నీటిలో నీ నీడ నాదని తెలిసి మురిసే తెల్లకలువను నేను.

                                                               - శ్రీ

Kaluva māṭa

Chukkala naḍuma ninnu chūsi
Nēnu cukkanu kālēkapōtinani mūtimuḍicānu.
Nī kōsamē nirantaraṁ kaḷḷu teraci
Eduru chūsē kaluva nēnani telusukunnānu.
Niṅgi chīra taḷuku beḷukula tārakanu kānu
Nīṭilō nī nīḍa nādani telisi murisē tellakaluvanu nēnu.

- Śrī