కన్నీటి చుక్కకు - కన్నీటి తో లేఖ


మనసు కదిలితే కరుగు తావు , భావమెరిగిన మదివి కావు!
కంటి పాపకు చంటి పాపవు కానీ, రంగు రంగుల కలవి కావు.

ఊహలెరుగని , రూపులేనీ చిన్నదానా ! ఓ  చుక్క పాపా  !
ఎందుకే నా తోడురావు ?

పసి పాప కంట ముత్యమై రాలి మారాము చేస్తావు.
అరే ! అంతలోనే అమ్మ మమతకు లొంగి పోతావు.

ప్రియురాలి కంట ఎర్రనీ పగడమై చిందులేస్తావు.
చెలికాడి రాకతో మంచు ఓలే కరిగి పోతావు.

మదిలోనే నిన్ను దాచిన నన్ను మాత్రం ఎందుకే చేరకున్నావు ?
నీ వెచ్చనైనా ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ......

- ఓ పసి పాపా (శ్రీ)

Kannīṭi chukkaku - kannīṭi tō lēkha

Manasu kadilitē karugu tāvu, bhāvamerigina madivi kāvu!
Kaṇṭi pāpaku chaṇṭi pāpavu kānī, raṅgu raṅgula kalavi kāvu.

Ūhalerugani, rūpulēnī chinnadānā! Ō chukka pāpā! Endukē nā tōḍurāvu?

Pasi pāpa kaṇṭa mutyamai rāli mārāmu chēstāvu.
Arē! Antalōnē am'ma mamataku loṅgi pōtāvu.

Priyurāli kaṇṭa erranī pagaḍamai chindulēstāvu.
Chelikāḍi rākatō man̄cu ōlē karigi pōtāvu.
Madilōnē ninnu dācina nannu mātraṁ endukē chērakunnāvu?
Nī vecchanainā ōdārpu kōsaṁ eduru chūstū......

- Ō pasi pāpā (śrī)