యేవో ఆలోచనల వలయాల్లో.... వలయాలల వలల్లో విలవిల లాడిన నా కల ,
ఒక్క సరిగా వళ్ళు విరిచి , కళ్ళు తెరచీ , తాళ్ళు తెంచి,
నాకళ్ళ వాకిళ్ళ లోంచి , గుండె గుమ్మనికేసి పరుగెడుతోంది....
"ఇక ఆగాను ఇక ఆగాను, నీ ఊహల జలపాతపు జోరును ,
నీ అశల సంద్రపు హోరును, ఇక ఆగాను ఇక ఆగాను ,
ఏమైనా ఇక ఆగాను" అంటూ పరుగెడుతోంది.
సడి సేయక వడివడిగా , ఇటుచూడక అటుచూడక ,
అడుగడుగున సిరి ఊహల హోయలొలుకుతు, ఉరకలేస్తూ
నను రమ్మని తన తోడుగ !! ఆగకుండా పరుగెడుతోంది.
మరి ఇకనేం !! నేకు కూడా తన దరిలో.. ఆ దారిలో ,
అలుపెరుగక అడుగు వేస్తూ, చిరుమువ్వల సడిని దాస్తూ
నా కల కనుసన్నలననుసరిస్తూ ... స్వప్నాన్వేషణ కై బయలుదేరాను...
- (శ్రీ -Sri as a Dream Chaser)
Whether your dreams are small or big, never stop chasing them.

Nice
ReplyDeleteబాగుంది